తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాల్వంచ డిఏవి, త్రివేణి, రెజీనా స్కూల్ విద్యార్థులు వెళుతున్న ఆటోని వెనుక నుంచి వేగంగా కారు ఢీ కొనడంతో... ఆటోలో ప్రయాణిస్తున్న డిఏవి స్కూల్ విద్యార్థి ఈశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మిగిలిన విద్యార్థులు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడటంతో గమనించిన స్థానికులు స్పందించి వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఇద్దరు విద్యార్థుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు పాల్వంచ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, పట్టణ ఎస్ఐ సుమన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.