Tuesday, 10 December 2024 05:43:30 PM
# దొప్పలపూడి కి శుభాకాంక్షల వెల్లువ # పాల్వంచ - కుంటినాగులగూడెంలో భారీగా ఇసుక నిల్వలు # మున్నూరు కాపులకు అండగా ఉంటాం : కాంపెల్లి # అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడి అన్నదానం # తాళ్లూరి హరి బాబుకు అవార్డు # గట్టికల్లులో మెగా రక్తదాన శిబిరం # సమస్య పరిష్కరించకుంటే... ఉద్యమిస్తాం... # పాల్వంచ లో యాష్ కాంట్రాక్టర్ల నిరసన దీక్షలు # పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు # ACB వలలో చిక్కిన పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు # ఈడీ దాడులు రాజకీయ కుట్ర : నూకల రంగారావు # రూ.17 వేలకే అన్ని రకాల ఆపరేషన్లు : డాక్టర్ బిందు పల్లవి # కాంపెల్లి కిరణం # పాల్వంచలో డాక్టర్ కామ కిషోరం # ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే కూనంనేని # రోడ్డు ప్రమాదంలో డి.ఏ.వి స్కూల్ విద్యార్థి మృతి # పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు # రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్...

పాల్వంచలో డాక్టర్ కామ కిషోరం

Date : 19 September 2024 11:02 PM Views : 3348

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలో ఓ కామాంధుడైన వైద్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. పాల్వంచ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఇప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇటీవల తన హాస్పటల్ ఎదురుగా ఉన్న ఆప్టికల్ షాపులో పనిచేస్తున్న ఓ యువతికి మాయ మాటలు చెప్పి ఆకట్టుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పి యువతిని పాల్వంచ నుండి ఖమ్మం, హైదరాబాద్ ఆపై గోవాకు తీసుకెళ్లాడు. గోవాలో తాళి కట్టి శారీరకంగా లోపరుచుకున్నాడు. ఇటీవల వారిద్దరూ పాల్వంచ వచ్చారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అనంతరం ఆ డాక్టర్ ను గట్టిగా నిలదీశారు. దీంతో డాక్టర్ యువతి కుటుంబంతో రాజీ కుదుర్చుకొని చేసిన తప్పుకు పరిహారంగా 18 లక్షల రూపాయలు ముట్ట చెప్పినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. కాగా గతంలో కూడా ఈ కామ కిషోరం  తన వద్దకు వచ్చే రోగులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్ళగా ఆమెకు అసభ్యకర మెసేజ్ లు పెట్టి ఇబ్బందులకు గురి చేశాడు. ఏది ఏమైనా పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి, ఇటు యువతులకు, అటు ఆసుపత్రికి వచ్చే రోగులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి కీచక డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వంచ ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :