Monday, 02 March 2026 12:29:10 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

కాంపెల్లి కిరణం

Date : 25 September 2024 07:23 PM Views : 2476

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, సంధ్య పటేల్ దంపతుల ద్వితీయ కుమార్తె కాంపెల్లి కిరణ్మయి పటేల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ (మెడికల్ యూనివర్సిటీ) బుధవారం విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో రాష్ట్ర స్థాయిలో 128వ ర్యాంకు సాధించినది. పాల్వంచకు చెందిన కాంపెల్లి కిరణ్మయి పటేల్ నీట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 128వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కాంపెల్లి కిరణ్మయి పటేల్ 10 వ తరగతి వరకు పాల్వంచలోని రెజీనా కాన్వెంట్  స్కూల్లో చదువుకొని 10 వ తరగతిలో 10 కి 10 జీపీఏ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచింది. ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, బాచుపల్లి, హైదరాబాద్ లో చదివి 1000 మార్కులకు గాను 973 మార్కులు సాధించింది. 2024 లో జరిగిన నీట్ పరీక్షలలో 720 మార్కులకు గాను 673 మార్కులు సాధించి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్లో కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ లో ఎంబిబిఎస్ సీట్ సాధించి ఇంకా మెరుగైన కాలేజీ కోసం తదుపరి రౌండ్ కౌన్సిలింగ్ కోసం వేచియున్నది. ఈ క్రమంలో నిన్న తెలంగాణ రాష్ట్ర ర్యాంకులు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ విడుదల చేయడంతో అందులో రాష్ట్ర స్థాయిలో 128వ ర్యాంక్ సాధించడం పట్ల కాంపెల్లి కిరణ్మయి పటేల్ తల్లి,దండ్రులు కాంపెల్లి కనకేష్ పటేల్, సంధ్య పటేల్, అక్క కాంపెల్లి తన్మయి పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :