తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఈ రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేయించుకోవాలంటే వేలు, లక్షల్లో ఖర్చు అవుతుంది. అలాంటిది పేద ప్రజలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ప్రముఖ ప్రసూతి సంతాన సాఫల్య వైద్యురాలు బిందు పల్లవి కొత్తగూడెం లోని బిందుపల్లవి ఆసుపత్రిలో అన్ని రకాల ఆపరేషన్ లు కేవలం 17 వేల కు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఇప్పటికే ఉచిత ఓపి సేవలు అందిస్తున్నారు. అన్ని రకాల ఆపరేషన్లు, మందులు, రక్త పరీక్షలు, ఆసుపత్రి, మత్తు డాక్టర్ చార్జీలు అన్ని కలిపి మొత్తం రూ 17 వేలకు ప్రతి శని, ఆదివారాల్లో ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు.
క్లిష్టతరమైన ఎమర్జెన్సీ కేసులను కూడా ఎటువంటి అధిక చార్జీలు లేకుండా అందుబాటు ధరల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సాధారణ కాన్పులకే ప్రయత్నం చేస్తున్నామని తప్పని పరిస్థితుల్లోనే ఆపరేషన్లు చేస్తామన్నారు. కాన్పు, గర్భసంచి, సిస్ట్ తొలగించడం, పీసీఓడీ డ్రిల్లింగ్, ఈ టాపిక్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ బయట చేయించుకుంటే ఒక్కో ఆపరేషన్ కు 50 వేలు దాకా ఖర్చవుతుందన్నారు. ఇటువంటి ఆపరేషన్లను రూ.17,000/- లకే చేస్తున్నామని, ఆధునిక ఆపరేషన్ థియేటర్ అనుభవం గల నర్సులతో కొత్తగూడెం ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ బిందుపల్లవి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.