Tuesday, 10 December 2024 03:58:02 PM
# దొప్పలపూడి కి శుభాకాంక్షల వెల్లువ # పాల్వంచ - కుంటినాగులగూడెంలో భారీగా ఇసుక నిల్వలు # మున్నూరు కాపులకు అండగా ఉంటాం : కాంపెల్లి # అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడి అన్నదానం # తాళ్లూరి హరి బాబుకు అవార్డు # గట్టికల్లులో మెగా రక్తదాన శిబిరం # సమస్య పరిష్కరించకుంటే... ఉద్యమిస్తాం... # పాల్వంచ లో యాష్ కాంట్రాక్టర్ల నిరసన దీక్షలు # పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు # ACB వలలో చిక్కిన పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు # ఈడీ దాడులు రాజకీయ కుట్ర : నూకల రంగారావు # రూ.17 వేలకే అన్ని రకాల ఆపరేషన్లు : డాక్టర్ బిందు పల్లవి # కాంపెల్లి కిరణం # పాల్వంచలో డాక్టర్ కామ కిషోరం # ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే కూనంనేని # రోడ్డు ప్రమాదంలో డి.ఏ.వి స్కూల్ విద్యార్థి మృతి # పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు # రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్...

ఈడీ దాడులు రాజకీయ కుట్ర : నూకల రంగారావు

Date : 28 September 2024 06:47 PM Views : 611

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడీ దాడులు బిజెపి పార్టీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల రంగారావు అన్నారు.  శనివారం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూకల రంగారావు కాంగ్రెస్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బిజెపి భయపెట్టాలని చూస్తుందని, బిజెపి వ్యతిరేక పక్షాలపై నిరంతరం ఈడి దాడులు చేయడమే లక్ష్యం గా పెట్టుకుందన్నారు. కర్ణాటకలో కూడా బిజెపి ఇదే తరహాలో ముందుకు సాగిందని, డీకే శివప్రసాద్ పై కూడా ఇలానే దాడులు ప్రయోగం చేశారని అన్నారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను కూడా వదలకుండా కేంద్రంలోని బిజెపి ఈడి దాడులు చేయించింది అని తెలిపారు. ఈడీ దాడులతో కాంగ్రెస్ కు ఏ విధమైన నష్టం జరగదని, రానున్న హర్యానా,జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.  రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం శ్రమిస్తున్నట్లు నూకల రంగారావు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్.డి.ఎమ్ కోర్డినేటర్ బద్ది కిషోర్, ఎస్సీ సెల్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు పెంకి శ్రీనివాస రావు, పాల్వంచ రూరల్ ఓబిసి అధ్యక్షులు కట్టా సోమయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాము నాయక్, మైనారిటీ కాంగ్రెస్ జిల్లా నాయకులు షేక్ దస్తగిరి, నాయకులు సాంబయ్య, చాంద్, హుస్సేన్ నాయక్, జల్లారపు నాగేశ్వర రావు, వేమా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :