తెలంగాణ / లిబర్టీ న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై 18500 కోట్ల రూపాయల భారాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఈ.ఆర్.సి ఎదుట ప్రజల గొంతుకను వినిపించి విద్యుత్ చార్జీల పెంపును నిలుపుదల చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు, భద్రాద్రి జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ల పిలుపుమేరకు పాల్వంచ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ ల ఆధ్వర్యంలో పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ నందు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాలనే కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల ప్రయత్నాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం విఫలం చేసి విజయం సాధించిన సందర్భంగా బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు మిఠాయిలు పంచి పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్ లు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిత్యం కరెంటు కోతలతో సతమతమైన తెలంగాణ ప్రాంతాన్ని కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 2014 నుండి 2023 వరకు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేసి, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తును అందజేసి ఏ రోజు కూడా విద్యుత్ చార్జీలను పెంచలేదని, పది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయడం మరిచి తెలంగాణ రాష్ట్ర ప్రజలపై 18500 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం మోపాలని చూడటంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రజల తరపున కల్వకుంట్ల తారక రామారావు, జగదీశ్ రెడ్డి మధుసూదనాచారి తదితరులు ఇ.ఆర్.సి ఎదుట హాజరై ప్రజల గొంతుక వినిపించి విద్యుత్ చార్జీలు పెంచవద్దని తమ వాదనను తెలపడంతో ఈ ఆర్ సి విద్యుత్ చార్జీల పెంపుదలను నిలిపి వేసిందని, ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై ఇటువంటి పన్నుల భారాన్ని మోపకుండా వారు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేరు సింధు తపస్వి, కొత్తచెరువు హర్షవర్ధన్, సంగ్లోత్ రంజిత్, మారుమూల కిరణ్, పూజాల ప్రసాద్, కాలేరు అఖిల్ మహర్షి, తోటలోహిత్ సాయి, ముత్తినేని గోకుల్, గండికోట సురేష్, ఆలీ, సాయి కిరణ్, భరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.