Wednesday, 29 July 2026 06:41:33 PM
# గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న వనమా రాఘవేంద్రరావు # పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ

పాల్వంచ లో యాష్ కాంట్రాక్టర్ల నిరసన దీక్షలు

Date : 07 November 2024 02:41 PM Views : 2545

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ యాష్ పాండ్ల నుండి బూడిద తరలింపునకు ఎంపిక చేసిన వారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్ లో కాలుష్య ప్రభావిత ప్రాంతాలైన గిరిజన కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు గురువారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ముత్యాల విశ్వనాథం, అడుసుమిల్లి సాయిబాబా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్, బిజెపి నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు దొడ్డా రవి, తులసీరామ్, సి.ఐ.టి.యు సత్య దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యాష్ కాంట్రాక్టర్ల నాయకులు మాట్లాడుతూ గత సెప్టెంబర్ లో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బూడిద తరలింపు కోసం దరఖాస్తులు స్వీకరించారని, వారిలో 52 మందిని ఎంపిక చేశారని, నెల రోజులు గడుస్తున్నా వారికి అనుమతులు ఇవ్వక పోవడంతో బూడిద తరలింపు ఆలస్యం అవుతోందన్నారు. దీని వల్ల బూడిద నిల్వలు పెరిగి కాలుష్యం అధికం అవుతున్నట్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ ఎస్సీ, ఎస్టీ, వడ్డెర,జనరల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ధర్మసోతు చందర్, డిష్ నాయుడు, భట్టు చందు నాయక్, భట్టు రవి, పాషా, కృష్ణ, వీరన్న, వీరు, అశోక్, జవహార్, అశోక్, కిషోర్, శ్రీకాంత్, భట్టు గాంధీ, సీతారాములు, హరీష్, వంశీ, సంజయ్, ప్రసాద్, నరేష్, చందర్ లాల్, శశి కుమార్, లక్ష్మణ్, రాజ్ కుమార్, శంకర్, కృష్ణ నాయక్, రమేష్, భీమా, మురళి, బంగారి, సునీత, ఐశ్వర్య  తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: