Tuesday, 10 December 2024 05:28:14 PM
# దొప్పలపూడి కి శుభాకాంక్షల వెల్లువ # పాల్వంచ - కుంటినాగులగూడెంలో భారీగా ఇసుక నిల్వలు # మున్నూరు కాపులకు అండగా ఉంటాం : కాంపెల్లి # అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడి అన్నదానం # తాళ్లూరి హరి బాబుకు అవార్డు # గట్టికల్లులో మెగా రక్తదాన శిబిరం # సమస్య పరిష్కరించకుంటే... ఉద్యమిస్తాం... # పాల్వంచ లో యాష్ కాంట్రాక్టర్ల నిరసన దీక్షలు # పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు # ACB వలలో చిక్కిన పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు # ఈడీ దాడులు రాజకీయ కుట్ర : నూకల రంగారావు # రూ.17 వేలకే అన్ని రకాల ఆపరేషన్లు : డాక్టర్ బిందు పల్లవి # కాంపెల్లి కిరణం # పాల్వంచలో డాక్టర్ కామ కిషోరం # ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే కూనంనేని # రోడ్డు ప్రమాదంలో డి.ఏ.వి స్కూల్ విద్యార్థి మృతి # పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు # రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్...

గట్టికల్లులో మెగా రక్తదాన శిబిరం

Date : 09 November 2024 07:26 PM Views : 733

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో శనివారం మద్యపాన నిషేధ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సూర్యాపేట డిఎస్పీ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గట్టికల్లు లో మద్యపానం నిషేధం ప్రారంభించి గ్రామస్తులంతా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని డిఎస్పీ రవి అభినందించారు. సమస్యాత్మక గ్రామంగా ఉన్న గట్టికల్లు రాబోయే ఎన్నికలలో శాంతియుత గ్రామంగా చేస్తామని డిఎస్పీ ప్రకటించారు. అనంతరం గ్రామ యువజన సంఘాలకు చెందిన యువకులు, గ్రామస్తులు రక్తదానం చేశారు. రాజకీయాలకతీతంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మద్యపాన నిషేధం బాటలో పరిసర గ్రామాలు నడుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రక్తదానంతో మరొకరికి పునర్జన్మ ఇవ్వవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని అన్నారు. రక్తం అందక ప్రతి రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, యువకులు రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  అనంతరం గ్రామ మద్యపాన నిషేధ శాఖ కమిటీ, యువజన సంఘాలు డిఎస్పీ రవి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నాయకులు బైరు వెంకన్నగౌడ్, ఆత్మకూర్ (ఎస్) SI శ్రీకాంత్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత భూపతి రాములును, సొంత ఖర్చులతో గ్రామంలోని రోడ్లను మరమ్మతులు చేసిన సంద్యాల నాగార్జునను డిఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మండల బాధ్యులు దండా వెంకటరెడ్డి, దొంతగాని కరుణాకర్ గౌడ్, గంపల కృపాకర్, గుగులోత్ గణేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :