Wednesday, 29 July 2026 06:42:05 PM
# గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న వనమా రాఘవేంద్రరావు # పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ

తాళ్లూరి హరి బాబుకు అవార్డు

Date : 25 November 2024 07:59 PM Views : 1628

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : నాగర్ కర్నూలుజిల్లా లో జరిగిన స్వేరో ఏడవ జాతీయ కన్వెన్షన్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఏరో సంస్థల అధినేత  తాళ్లూరి హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్నారు. సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హరి బాబుకు ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలైన ఎదుర్కొని వెనకడుగు వేయకుండా హరిబాబు అంచలంచెలుగా ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయం అని అన్నారు. హరిబాబు తన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదుగుతూ నలుగురికి ఉపాధిని చూపిస్తూ నేడు మేము ఎవరికీ తక్కువ కాదు అని నిజం చేశారన్నారు. ఒక స్వేరోగా హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకోవడం గర్వకారణం అన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి నేడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నర్సింగ్ కళాశాలకు అనుమతిని తీసుకొచ్చి తన సొంత ఊరైన పాల్వంచలో నర్సింగ్ కళాశాల ప్రారంభించడం సంతోషిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా తాళ్లూరి హరిబాబు మాట్లాడుతూ మొక్కవోని ధైర్యం వెనకడుగు వేయని పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో మనకు అసాధ్యం అంటూ ఏమీ లేదన్నారు. నేడు ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు తీసుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ తమ విలువైన సలహాలు సూచనలు అందిస్తూ సహకరించిన సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ అవార్డు అందుకోవడానికి సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: