తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం నాయకులకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ పలు కీలక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వర్తక సంఘ భవనంలో ఆదివారం తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ, మండల మున్నూరు కాపుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ... గతంలో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం పేరుతో రాష్ట్ర కమిటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, ఆ కమిటీకి అనుబంధంగా పాల్వంచ పట్టణ, మండల కమిటీలు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మున్నూరు కాపులకు ఎటువంటి సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించే విధంగా కృషి చేసే వారిని ఈ కమిటీలోకి తీసుకుంటామని, ఇప్పుడు ఏర్పడబోయే కమిటీలకు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. మూడు సంవత్సరాల క్రితం పాల్వంచ పట్టణ, మండల కమిటీల ఏర్పాటు వాయిదా పడిందని, వాయిదా పడటం వల్ల కొంతమంది మున్నూరు కాపు వ్యక్తులు, మున్నూరు కాపు కులస్తులకు సంబంధం లేని ఆంధ్ర ప్రాంతానికి చెందిన తూర్పు కాపులు, నాగేశపోల్లు కలిసి ఒక సంవత్సరం క్రితం పాల్వంచ పట్టణం మున్నూరు కాపు సంఘం అని రిజిస్ట్రేషన్ చేయించుకొని పాల్వంచలో మున్నూరు కాపు సంఘం అంటే వారిదేనని, తూర్పు కాపులు, నాగేశపొల్లు 500 రూపాయలు తీసుకొని కుల సంఘం సర్టిఫికెట్లు జారీ చేస్తూ వారికి సంబంధం లేని మున్నూరు కాపు కులాన్ని వారి కులమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అటువంటివారు చేసిన పనులతో నిజమైన తెలంగాణ మున్నూరు కాపులకు భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు పొందడం కోసం దళారులను ఆశ్రయించి తాహశీల్దార్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వడం తో నిజమైన మున్నూరు కాపులు కుల ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటే వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తూ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని, నిజమైన మున్నూరు కాపులు సర్టిఫికెట్ తీసుకోవడానికి డబ్బులు ఎందుకు చెల్లించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన తెలంగాణ మున్నూరు కాపు కులస్తులకు అండగా నిలిచేందుకే ఇప్పుడు ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు చింత నాగరాజు, ఆకుల ఆనంద్, మిరియాల కమలాకర్, మద్దుల వీర మోహన్ రావు, బాలినేని సత్తిబాబు, బాలినేని నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, తోట మల్లేశ్వరరావు, సాధం రామకృష్ణ, పత్తిపాటి శ్రీనివాసరావు, పూసల కొండలరావు, కొత్తచెరువు హర్షవర్ధన్, ముళ్లపాటి శ్రీకాంత్, గ్రంధి రమేష్, సంగీతం లెనిన్, తోట శ్రీనివాసరావు, ముత్యాల శేఖర్, అల్లాడ రమేష్, అడపాల వెంగళరావు, గంధం నరసింహారావు, కనకం రామయ్య, భోగి లక్ష్మయ్య, రామిశెట్టి లక్ష్మణ్, తోట ప్రవీణ్, ధర్మపురి ప్రసాద్, పూజాల ప్రసాద్, జమ్ముల శివ, బాలినేని వీరయ్య, చిల్ల వెంకన్న, అన్నం ప్రభాకర్, బండారి సుధాకర్, బండారి క్రాంతి, వాసనశెట్టి వెంకటేశ్వర్లు, బండి వెంకన్న, మద్దిరాల అశోక్, కుమ్మరికుంట్ల నాగేశ్వరరావు, తోట లోహిత్ సాయి, గోవాడ గుణ, ముత్తినేని గోకుల్, ధర్మపురి రాము, తోట గోపి చరణ్, యమ్మన భాను తేజ, వేమా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.