తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులకు సకాలంలో సేవలు అందిస్తున్నారని, వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం జాతీయ స్థాయిలో NQAS సర్టిఫికెట్ తో ప్రశంసించిందని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి కి జాతీయ స్థాయిలో గుర్తింపు లబించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కొత్వాల నాయకత్వంలో వైద్యులను ఘనంగా సన్మానించారు. గురువారం కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రి RMO డాక్టర్ సోమరాజు దొర, ఆసుపత్రి సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ రాంప్రసాద్ లతో పాటు పలువురు డాక్టర్లును సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ వైద్యులు దేవుళ్లతో సమానమని, రోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత డాక్టర్లదేనన్నారు. వైద్య సేవలు పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమాల్లో కొత్వాల తోపాటు పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, యూత్ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు పైడిపల్లి మహేష్, మెలిగ మహేష్, కాంగ్రెస్ నాయకులు Y.వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, గంధం నర్సింహారావు, మస్నా శ్రీనివాస్, ఉండేటి శాంతివర్ధన్, ప్రసాద్, మల్లేష్, దేవా, రాము, తదితరులు పాల్గొన్నారు.