Thursday, 10 July 2025 09:05:58 AM
# ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎడవల్లి కృష్ణ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఏ.వజీర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు

పాల్వంచ ప్రెస్ క్లబ్ కు టీవీ బహుకరించిన డాక్టర్ ముక్కంటేశ్వర రావు

Date : 13 December 2024 02:50 PM Views : 1139

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఇటీవల నూతనంగా నిర్మాణమై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించబడిన పాల్వంచ ప్రెస్ క్లబ్ కు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మందడపు ముక్కంటేశ్వర రావు 55వేల రూపాయల విలువైన 55" టివి, హోమ్ థియేటర్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించారు. శుక్రవారం బిసిఎం జాతీయ రహదారి పక్కనున్న పాల్వంచ ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరులందరి సమక్షంలో టీవీని అందజేసి ప్రారంభించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ ముక్కంటేశ్వర రావు ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ ముక్కంటేశ్వర రావు మాట్లాడుతూ  పాల్వంచ మీడియా మిత్రుల కోరిక మేరకు 55 వేల రూపాయలతో టీవీ, హోమ్ థియేటర్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్. సంజీవ్ కుమార్, చండ్ర నరసింహారావు, కార్యదర్శి షేక్ సుభాని, ఎం.ఎ. రజాక్, వెంకట నారాయణ, ఏ.అబ్బురాం, ఎం.ఎ. వాజిద్, జగదీష్, పవన్, రామ్మోహన్ గౌడ్, పుల్లారావు, భద్రం, శనగా రామచందర్, సంతోష్, దారా శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :