తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ఒడ్డుగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం జాతీయ" రైతు దినోత్సవాన్ని" ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మిర్యాల రాణి, రైతులను సన్మానించి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం శ్రీ చైతన్య సంస్థల (కొత్తగూడెం జోన్) డి.జి.యం జయప్రకాష్ మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నుముక లాంటివారని, దేశానికి అన్నం పెట్టే వ్యక్తి రైతు అని కొనియాడారు. భారతదేశం రైతుకు ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. ఈ సందర్భంగా మిర్యాల రాణి మాట్లాడుతూ ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులు సమాజానికి వెన్నుముక అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు జీవనోపాధిని నిలబెట్టడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పిపిటి ఇన్ చార్జ్ నదియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.