తెలంగాణ / లిబర్టీ న్యూస్ : క్రిస్టియన్ సోదర, సోదరీమణులు అందరికీ ఖమ్మం ప్రముఖ న్యాయవాది గరికె సంపత్ కుమార్ బుధవారం క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టమస్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఈ క్రిస్మస్ పండగ నుండి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ఏసుప్రభువు దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, యేసుక్రీస్తు సూచించిన బోధనలు అనుసరిస్తూ ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని సంపత్ కుమార్ ఆకాంక్షించారు.