Wednesday, 22 January 2025 12:27:44 PM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ సోమరాజు దొర # కొత్వాలకు శుభాకాంక్షల వెల్లువ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాలోత్ హరి # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నల్లమల సత్యనారాయణ # పాల్వంచలో డిసెంబర్ 31న బిర్యానీ, కేక్ తింటే పైకే..!! # పాల్వంచలో జోరుగా మట్టి తవ్వకాలు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వర రావు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బిందు పల్లవి # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్

పాల్వంచలో జోరుగా మట్టి తవ్వకాలు

Date : 28 December 2024 04:29 PM Views : 494

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పుల్లాయిగూడెంకు చెందిన ఓ రైతు పొలంలో నుండి ఓ కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తోలకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని దిగమింగుతూ, ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. కేటిపిఎస్ ఏదో దశకు చెందిన రెండో యాష్ పాండ్ అభివృద్ధి పనుల కోసం సంస్థ 25 కోట్ల నిధులను విడుదల చేసింది. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కావేరీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ కాంట్రాక్టర్ గత సంవత్సరం పనులను మొదలు పెట్టారు. అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ 2024 వరకు పనులు పూర్తి చేయాలి.. ఇంత వరకు యాభై శాతం పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది. చట్టలను గౌరవిస్తూ, ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన సదరు సంస్థ ఆది నుండి ఏజెన్సీ చట్టాలను, అధికారులను బేఖాతర్ చేస్తూ పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకానొక దశలో తాను చేస్తున్న అక్రమాలకు అధికారులు సహకరించకుంటే పనులను మద్యలోనే నిలిపివేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారనే వదంతులు పాల్వంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. యాష్ పాండ్ కు కావలసిన మట్టి తోలకాలకు, ఇసుక, కంకర సంభంధిత మైనింగ్ శాఖ అధికారుల నుండి అనుమతులు తీసుకోవాలి. అనుమతుల మేరకు మట్టి తవ్వకాలు చేపట్టాలి. కానీ సదరు గుత్తేదారు ప్రభుత్వ నిబంధనలు లెక్కచేయకుండా, అనుమతులు తీసుకోకుండా స్థానిక రైతులను మభ్యపెట్టి వారి పొలాల నుండి యధేశ్చగా మట్టి తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కోట్ల విలువైన మట్టిని యధేశ్చగా కొల్లకొడుతున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతూ, పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతామంటూ ... భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే పుకార్లు శికార్లు చేస్తున్నాయి. అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :