తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పాల్వంచ పట్టణ పరిధిలో ADMS e బైక్ షో రూమ్ నందు బుధవారం రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TSTTF రాష్ట్ర నాయకులు బానోత్ రాములు నాయక్, హరిసింగ్ రాథోడ్, మోహన్ రాథోడ్, సపావట్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని, ఆంగ్ల సంవత్సరం 2024 లో చేదు జ్ఞాపకాలువదిలి, నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాలు తీసుకోని 2025 లో ముందుకు సాగాలని, అందరికి ఆరోగ్యం ఆ దేవుడు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూడ్ చిరంజీవి, మోహన్ తేజావత్, నరసింహ, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ భద్రు నాయక్, యువ సేన జిల్లా అధ్యక్షులు బానోత్ భరత్, డీఆర్వో రామకృష్ణ, ఇస్లావత్ రాందాస్, రవి నునావత్, వెంకట్ తేజావత్, బాబురావు, అనిల్, వంశీ, వేణు రాథోడ్, మాలోత్ హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.