తెలంగాణ / లిబర్టీ న్యూస్ : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, ప్రజలు చేరుకొని, ఆయనను శాలువా, బొకేలతో సన్మానించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ తానూ నిత్యం కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.