తెలంగాణ / లిబర్టీ న్యూస్ : స్వాతంత్ర్య భారతావనికి దశ, దిశ చూపిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన మహోన్నతమైన రోజును జరుపుకునే గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, ఇందిరా గాంధీ నేషనల్ గోల్డ్ అవార్డు గ్రహీత ఎంఏ.వజీర్ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం అంత ముఖ్యమని ఎంఏ.వజీర్ అన్నారు.