తెలంగాణ / లిబర్టీ న్యూస్ : మార్చి 14 న జరిగే హోలీ వుడ్ ను జయప్రదం చేయాలని అరోరా విద్యా సంస్థల చైర్మన్ తాళ్లూరి హరిబాబు అన్నారు. శుక్రవారం పాల్వంచ పట్టణంలోని అరోరా కళాశాల లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగలు మత సామరాస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, అందులో హోలీకి ఒక ప్రత్యేకత ఉందని కుల,మతాలకు అతీతంగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటారన్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పండగల విలువలను తెలియజేసే ఉదేశ్యంతో మెట్రో నగరాలకే పరిమితమైన హోలీ వుడ్ సెలబ్రేషన్స్ ను కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో మొట్టమొదటి సారి ఏర్పాటు చేసిన ఏమ్.కె.ఏ సోషల్ మీడియా ప్రమోటర్ గణేష్ ను అభినందించారు. హోలీవుడ్ కార్యక్రమానికి మావంతు గా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది యెర్రా కామేష్, గోగిళ్ళ గణేష్, బన్ను, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.