తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ కాలనీలోని అభ్యుదయ పాఠశాల వద్ద కొంతమంది ఆకతాయిలు బైకులపై వేగంగా వెళుతూ... పెద్ద పెద్దగా హారన్ లు మోగిస్తూ.. విద్యార్థినీలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. గమనించిన విద్యార్థినీల తండ్రి రామ్మోహన్ గౌడ్ పాల్వంచ పట్టణ ఎస్ఐ సుమన్ కు ఫోన్ లో సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై పాఠశాల ఆవరణ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాలకు చెందిన విద్యార్థులు తంతెనపల్లి దీప్తి, దీక్ష ఎస్సైకు బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగా ఎస్సై సుమన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, వారి అండగా ఉంటానని తెలిపారు