తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. కొత్తగూడెం క్లబ్ లో తెలంగాణ జాగృతి విస్తృత సమావేశం ముగిసిన అనంతరం పాల్వంచ లోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాల్వంచ కో- ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేశారు. ఇటీవల కాంపెల్లి కనకేష్ పటేల్ నూతన గృహ నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కాలేకపోయారు. నేడు వారి నివాసానికి విచ్చేసి కాంపెల్లి కనకేష్ పటేల్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.