Saturday, 27 July 2024 12:41:32 PM
# ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని

మున్నూరు కాపులకు అండగా ఉంటా: కాంపెల్లి కనకేష్

Date : 05 March 2024 07:17 PM Views : 521

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మున్నూరు కాపు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలకు సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ డిమాండ్ చేశారు.  ఇదే అంశంపై మంగళవారం పాల్వంచ తహసిల్దార్ వివేక్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ లో 5 కుల ధ్రువీకరణ పత్రాలు, ఈ ఏడాది జనవరిలో 2 తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పాల్వంచలో మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు మున్నూరు కాపు కులస్తులకు కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి వలస వచ్చిన తూర్పు కాపు, ఇతర కులాల వారికి జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి తప్పుడు మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే రద్దు చేసి, ఆ కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై, సహకరించిన వారందరిపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఉండే దళారులకు రూ.30 వేల నుండి రూ.40 వేల వరకు ఇచ్చి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారని, తూర్పు కాపులైన వారు తప్పుడుగా మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు పొందటానికి డబ్బులు చెల్లిస్తుంటే నిజమైన మున్నూరు కాపులకు తాసిల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల విషయంలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగితే సహించబోనని, మున్నూరు కాపులకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల ఆనంద్ పటేల్, మెడిశెట్టి సాంబశివరావు పటేల్, తోట ప్రవీణ్ పటేల్, తోట లోహిత్ సాయి పటేల్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :